మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Sri Ranganatha Ashtakam 2 – శ్రీ రంగనాథాష్టకమ్ 2


పద్మాదిరాజే గరుడాదిరాజే విరించిరాజే సురరాజరాజే |
త్రైలోక్యరాజేఽఖిలరాజరాజే శ్రీరంగరాజే నమతా నమామి || 1 ||

శ్రీచిత్తశాయీ భుజంగేంద్రశాయీ నాదార్కశాయీ ఫణిభోగశాయీ |
అంభోధిశాయీ వటపత్రశాయీ శ్రీరంగరాజే నమతా నమామి || 2 ||

లక్ష్మీనివాసే జగతాంనివాసే హృత్పద్మవాసే రవిబింబవాసే |
శేషాద్రివాసేఽఖిలలోకవాసే శ్రీరంగవాసే నమతా నమామి || 3 ||

నీలాంబువర్ణే భుజపూర్ణకర్ణే కర్ణాంతనేత్రే కమలాకళత్రే |
శ్రీవల్లిరంగేజితమల్లరంగే శ్రీరంగరంగే నమతా నమామి || 4 ||

బ్రహ్మాదివంద్యే జగదేకవంద్యే రంగే ముకుందే ముదితారవిందే |
గోవిందదేవాఖిల దేవదేవే శ్రీరంగదేవే నమతా నమామి || 5 ||

అనంతరూపే నిజబోధరూపే భక్తిస్వరూపే శ్రుతిమూర్తిరూపే |
శ్రీకాంతిరూపే రమణీయరూపే శ్రీరంగరూపే నమతా నమామి || 6 ||

కర్మప్రమాదే నరకప్రమాదే భక్తిప్రమాదే జగతాధిగాధే |
అనాథనాథే జగదేకనాథే శ్రీరంగనాథే నమతా నమామి || 7 ||

అమోఘనిద్రే జగదేకనిద్రే విదేహ్యనిద్రే విషయాసముద్రే |
శ్రీయోగనిద్రే సుఖయోగనిద్రే శ్రీరంగనిద్రే నమతా నామామి || 8 ||

రంగాష్టకమిదం పుణ్యం ప్రాతఃకాలే పఠేన్నరః |
కోటిజన్మకృతం పాపం తత్ క్షణేన వినశ్యతి || 9 ||

ఇతి శ్రీరంగనాథాష్టకమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.